సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ క్యాబినెట్ భేటీ
- నూతన మద్యం విధానంపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
- ఇసుక సహా కొత్త మైనింగ్ విధానంపై చర్చ
- ప్రధానంగా, వాలంటీర్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఏపీ క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. నూతన మద్యం విధానంపై నేటి క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
గత ప్రభుత్వ హయాంలో మైనింగ్ వ్యవహారాలు తీవ్ర వివాదాస్పదం కాగా, కొత్త మైనింగ్ విధానంపై ఇవాళ్టి మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇందులోనే ఇసుక విధానం కూడా ఉంటుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా, పెండింగ్ లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వాలంటీర్లను తప్పకుండా కొనసాగిస్తామని ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇక, 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామన్న ఎన్నికల హామీ, పలు ఉద్యోగ నియామకాలకు నేటి క్యాబినెట్ భేటీలో పచ్చజెండా ఊపే అవకాశాలున్నాయి.
పరిశ్రమలకు భూ కేటాయింపులు, పీ-4 కార్యాచరణ, నీరు-చెట్టు బిల్లులకు నిధుల విడుదల, జలవనరుల ప్రాజెక్టుల పటిష్టతకు అత్యవసర నిధి కింద రూ.300 కోట్లు కేటాయించే అంశంపై చర్చిస్తారని తెలుస్తోంది.
ఇటీవల భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో బుడమేరు ముంపు, వరద సాయంపై క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఫైలుపై మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి.