టీడీపీలో చేరిన గంటా పద్మశ్రీ
- కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి లోకేశ్
- ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్
- పద్మశ్రీతో పాటు పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు
ఏపీలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ నాయకులు వలస బాట పడుతున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు.
తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ టీడీపీలో చేరారు. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో పద్మశ్రీతో పాటు పలువురు వైసీపీ నేతలు బుధవారం నాడు పార్టీ మారారు. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది.
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో పద్మశ్రీ టీడీపీలో చేరారు. పద్మశ్రీ, వైసీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ.అశోక్, ఎస్.కిశోర్, ఎస్.మురళీ, రెడ్డి కిశోర్ తదితరులకు మంత్రి లోకేశ్ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.
ఉండవల్లిలోని మంత్రి లోకేశ్ నివాసంలో ఈ చేరికలు జరిగాయి. అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.