ఆఫీస్ బ్రేక్ టైంలో కాపురం చేసి పిల్లల్ని కనండి: పుతిన్ సూచన
- రష్యన్లకు విజ్ఞప్తి చేసిన ప్రెసిడెంట్
- జాతీయ ప్రాధాన్యంగా భావించాలని వెల్లడి
- దేశంలో వేగంగా పడిపోతున్న జననాల రేటు
రోజంతా ఆఫీసులోనే గడిపేసే ఉద్యోగులు తమ బ్రేక్ టైంలో కాపురం చేసి పిల్లలను కనాలంటూ రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. కాఫీ, లంచ్ బ్రేక్ సమయాల్లో మీ భాగస్వామితో సన్నిహితంగా ఉండాలని సూచిస్తున్నారు. దేశంలో పడిపోతున్న జననాల రేటు క్షీణతను తగ్గించేందుకు కృషి చేయాలని చెప్పారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం రష్యాలో సంతానోత్పత్తి రేటు ప్రకారం ప్రతీ మహిళకు 1.5 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.
అయితే, జనాభా స్థిరత్వం కోసం ఈ రేటు 2.1 ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పిల్లలను కనాలంటూ పుతిన్ తన ప్రజలకు పిలుపునిచ్చారు. దీనిని జాతీయ ప్రాధాన్యంగా భావించాలని కోరారు. రోజులో సగటున 12 నుంచి 13 గంటలు ఆఫీసులలోనే గడుపుతున్న వారు పిల్లలను కనడం ఎలా సాధ్యమన్న ప్రశ్నకు ఆయన ఈ జవాబిచ్చారు.
ఉక్రెయిన్ తో యుద్ధం మొదలయ్యాక రష్యా యువత పెద్ద సంఖ్యలో దేశాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఇప్పటి వరకు సుమారు 10 లక్షల మంది రష్యన్ యువత దేశం దాటినట్లు సమాచారం. అటు యుద్ధంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం వాటిల్లుతోంది. ఇక ఈ ఏడాది 49వేల మరణాలు సంభవించాయి. ఇటు యువత ఎక్కువ సమయం ఆఫీసు పనుల్లోనే నిమగ్నమవ్వాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఆఫీసు బ్రేక్ టైమ్ ను భాగస్వామితో శృంగారానికి కేటాయించాలని పుతిన్ సూచించారు.
దీంతోపాటు రష్యా జనాభాను పెంచేందుకు పుతిన్ ప్రభుత్వం ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తోంది. పాతికేళ్లలోపు యువతి తొలి బిడ్డకు జన్మనిస్తే కొన్నిచోట్ల నగదు బహుమతి ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా అబార్షన్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. మహిళలకు ఫెర్టిలిటీ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చేయించే ఏర్పాట్లు చేసింది. రష్యా అధికారిక గణాంకాల ఏజెన్సీ ‘రోస్‌స్టాట్’ ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 16వేల తక్కువ జననాలు నమోదయ్యాయి.