ఢిల్లీ కొత్త సీఎం అతిశీకి నగలు, ఆస్తులు లేకున్నా కోటీశ్వరురాలే!

  • ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ
  • ఢిల్లీకి మూడో మహిళా సీఎంగా రికార్డు
  • మొత్తం నికర ఆస్తి రూ. 1.41 కోట్లు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో జైలుకెళ్లి బెయిలుపై బయటకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి. ఆయన స్థానంలో ఆప్ సీనియర్ నేత అతిశీ కొత్త ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ తర్వాత ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా అతిశీ రికార్డులకెక్కనున్నారు. తాను సీఎంను అయినా కేజ్రీవాల్ మార్గనిర్దేశకత్వంలోనే నడుస్తానని, ప్రజాప్రయోజనాల కోసం పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.  

అతిశీ నికర ఆస్తి విలువెంత? 
నేషనల్ ఎలక్షన్ వాచ్ వెబ్‌సైట్ (https://www.myneta.info/delhi2020/candidate.php?candidate_id=8811) ప్రకారం.. అతిశీ వద్ద రూ. 50 వేల నగదు మాత్రమే ఉంది. ఆమె ఆస్తుల విలువ మాత్రం రూ. 1.41 కోట్లు. ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తుల స్థూల విలువ రూ. 1,20,12,824. లెక్కించిన ఆస్తుల మొత్తం రూ. 1,25,12,823. ఆమె వద్దనున్న నగదు రూ. 50 వేలు కాగా, ఆమె భర్త వద్దనున్న రూ. 15 వేలు కలిపి మొత్తం రూ. 65 వేల నగదు ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు, ఫైనాన్స్ సంస్థలు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వద్ద మొత్తం రూ.1,00,87,323 ఉంది. నేషనల్ సేవింగ్ స్కీం (ఎన్ఎస్ఎస్), పోస్టల్ సేవింగ్స్ తదితర వాటిలో రూ. 18,60,500, ఎల్ఐసీ, ఇతర బీమా పాలసీల్లో రూ. 5 లక్షలు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఆమె వద్ద బంగారం, నగనట్రా లేకపోవడం విశేషం.


More Telugu News