ఇండియా నుంచి దుబాయ్ వెళ్లి.. ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ కొనుక్కోవడం లాభమా? నష్టమా?

  • ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ ధర భారత్‌లో రూ. 1,39,900
  • దుబాయ్‌లో రూ.1,16,550 మాత్రమే
  • అక్కడికి వెళ్లి కొన్కుకునేందుకు అయ్యే ఖర్చు దాదాపు రూ.1,43,550 
  • ఈ లెక్కన చూసుకుంటే ఇండియాలోనే ఐఫోన్ చీప్
ఇటీవల విడుదలైన ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ యాపిల్ అభిమానులను ఊరిస్తోంది. 256జీబీ మోడల్ ధర భారత్‌లో రూ. 5 వేల డిస్కౌంట్ పోను రూ. 1,44,900 అందుబాటులో ఉంది. క్రెడిట్ కార్డులతో కొంటే రూ.1,39,900కే సొంతం చేసుకోవచ్చు. భారత్‌లో కంటే దుబాయ్‌లో ఐఫోన్ చాలా చవగ్గా లభిస్తుంది. గతంలో ఐఫోన్‌ విడుదలైన వెంటనే ఇండియా నుంచి చాలామంది దుబాయ్ వెళ్లి కొనుక్కొనేవారు. మరి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్లి కొనుక్కోవచ్చేమో చూద్దాం. 

దుబాయ్‌లో ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ ధర ఏఈడీ 5,099 (దాదాపు రూ. 1,16,550). అంటే, మనతో పోలిస్తే చాలా చవక. 14 రోజుల టూరిస్టు వీసా కోసం రూ. 7 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి దుబాయ్‌కు విమానం ఖర్చులు రానుపోను రూ. 20 వేలు. అంటే దాదాపుగా రూ. 1,43,550 అవుతుంది. ఇంకా అక్కడ ఫుడ్ వగైరాల కోసం చేసే ఖర్చు అదనం. అంటే ఖర్చు తడిసిమోపెడవుతుంది. ఈ లెక్కన చూసుకుంటే ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్‌ను ఇక్కడ కొనుక్కోవడమే బెటర్.  

ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ ఫీచర్లు:  యాపిల్ ఇందులో  ఏ18 ప్రొ చిప్‌ను ఉపయోగించింది. ఇది అత్యంత వేగవంతమైన, అత్యంత సమర్థవంతమైన ప్రాసెసర్ అని యాపిల్ చెబుతోంది. అంతేకాదు, యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఫీచర్ కోసం దీనిని ఆప్టిమైజ్ చేసింది. కెమెరా కంట్రోల్ విషయానికి వస్తే.. ఫొటోగ్రఫీ, వీడియోగ్రపీ కోసం కొత్తగా ఫిజికల్ బటన్‌ను ఏర్పాటు చేసింది. కెమెరా సిస్టంపై ఇది మరింత నియంత్రణ అందిస్తుంది. ఇందులో 6.9 అంగుళాల డిస్‌ప్లేను ఉపయోగించారు. దీనివల్ల మరింత వ్యూయింగ్ అనుభవం సొంతమవుతుంది. అలాగే, 4కే 120 డాల్బీ విజన్‌ను ఉపయోగించారు. ఈ ఫీచర్ వల్ల వీడియోను మరింత స్మూత్‌గా, అత్యధిక రిజల్యూషన్‌తో చూసే వీలు కలుగుతుంది.


More Telugu News