నేడు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించనున్న తెలంగాణ ప్రభుత్వం

  • 11 గంటలకు మాదాపూర్ శిల్పకళా వేదికలో ఆవిష్కరించనున్న సీఎం
  • వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా కొత్త పారిశ్రామిక విధానం
  • కార్యక్రమంలో పాల్గొననున్న భట్టివిక్రమార్క, శ్రీధర్ బాబు
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీని ప్రకటించనుంది. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీని ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమ అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు సీఎం గతంలోనే వెల్లడించారు.

అమెరికాలో ఉన్నన్ని వ్యాపార అవకాశాలు తెలంగాణలోనూ ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త వాటిని ఖరారు చేయాలని సీఎం ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని విడుదల చేయనున్నారు.


More Telugu News