జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం

  • 24 నియోజకవర్గాల్లో ఈరోజు పోలింగ్
  • సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
  • బరిలో నిలిచిన 219 మంది అభ్యర్థులు
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 24 స్థానాల్లో ఉదయం 7 గంటలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, 23 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

పాంపోర్, త్రాల్, పుల్వామా, రాజ్‌పోరా, జైనాపోరా, షోపియాన్, డి.హెచ్ పోరా, కుల్గాం, దేవ్‌సర్, దూరు, కోకెర్‌నాగ్ (ఎస్టీ), అనంత్‌నాగ్ వెస్ట్, అనంత్‌నాగ్, శ్రీగుఫ్వారా-బిజ్‌బెహరా, షాంగస్-అనంతనాగ్, ఈస్ట్, పహల్గాం, ఇండెర్వాల్, కిష్త్‌వార్, పాడర్ నాగ్‌శేని, భదర్వా, దోడా, దోడా వెస్ట్, రాంబన్, బనిహాల్ స్థానాల్లో మొదటి విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి.


More Telugu News