లెబనాన్‌లో ఒకేసారి ‘పేజర్స్’ పేలుళ్లు... వెయ్యి మందికి గాయాలు
- ఉగ్రసంస్థ హిజ్బుల్లా లక్ష్యంగా టెలికమ్యూనికేషన్ పరికరాల పేలుళ్లు
- తీవ్రంగా గాయపడ్డ హిజ్బుల్లా సభ్యులు, ఫైటర్లు, వైద్యులు
- ఇజ్రాయెల్ పనేనని ప్రకటించిన హిజ్బుల్లా
లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థ ‘హిజ్బుల్లా’ ఉలిక్కిపడే పరిణామం మంగళవారం జరిగింది. వాయిస్ లేదా ఆల్ఫాన్యూమరిక్ సందేశాలను స్వీకరించే వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ పరికరమైన ‘పేజర్’ పేలుళ్ల ఘటనలు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. పట్టణాలు, పట్టణాల శివార్లలో ఏకకాలంలో సంభవించిన ఈ పేలుళ్లలో కనీసం వెయ్యి మంది గాయపడ్డారని తెలుస్తోంది. వీరిలో హిజ్బుల్లా సభ్యులు, ఫైటర్లు, వైద్యులు ఉన్నట్టు తెలుస్తోంది.
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇది ఇజ్రాయెల్ పనేనని హిజ్జుల్లా ప్రకటించింది. అతిపెద్ద భద్రతా వైఫల్యంగా అభివర్ణించింది. అన్ని పేజర్లు దాదాపు ఒకే సమయంలో పేలాయని తెలిపింది.
కాగా అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రతీకారంగా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రారంభించగా.. హమాస్‌కు హిజ్బుల్లా మొదటి నుంచి మద్దతు ఇస్తోంది. కాగా అమెరికా, యూరోపియన్ యూనియన్ రెండింటి నిషేధాన్ని హిజ్బుల్లా ఎదుర్కొంటోంది.