ప్రయాణంతో వృద్ధాప్యం నెమ్మది... సరికొత్త అధ్యయనం!

  • ప్రయాణాలు చేస్తే వయసు పెరుగుదల ప్రక్రియ నెమ్మదిస్తుందన్న అధ్యయనం
  • ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం పరిశోధకుల వెల్లడి
  • భౌతిక, మానసిక ఆరోగ్యానికి ప్రయాణాలు తోడ్పడతాయన్న అధ్యయనం
చూస్తుండగానే కాలం గడిచిపోతోందని, వయసు పెరిగిపోతోందని ఎప్పుడైనా అనిపించిందా? మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల మధ్య ఇలాంటి భావన కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. 

అయితే వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేసే, ఆయుష్షును మరిన్ని సంవత్సరాలు పెంచే సులభమైన పరిష్కార మార్గం ‘ప్రయాణం’ అని నూతన అధ్యయనం చెబుతోంది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమని అంటోంది. ప్రయాణం వృద్ధాప్య ప్రక్రియను మందగించేలా చేస్తుందని, సుదీర్ఘమైన ఆరోగ్యకర జీవితానికి బాటలు వేస్తుందని 'జర్నల్ ఆఫ్ ట్రావెల్ రీసెర్చ్‌'లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. 

ఆస్ట్రేలియాలోని ఎడిత్ కోవాన్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. వృద్ధాప్యాన్ని ఆపలేమని, అయితే నెమ్మదింపజేయవచ్చని వర్సిటీ పీహెచ్‌డీ కేండిడేట్ ఫాంగ్లీ హు చెప్పారు. శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిపైనా ప్రయాణం ప్రయోజనకరమైన ప్రభావాలను చూపుతున్నట్టు తమ బృందం కనుగొందని వెల్లడించారు. 

పర్యాటకం అంటే కేవలం విశ్రాంతి, వినోదం మాత్రమేనని భావించొద్దని, శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుందని వివరించారు.


More Telugu News