ఆంధ్రప్రదేశ్ కు వర్ష సూచన

  • ఏపీకి మూడు రోజుల పాటు వర్ష సూచన
  • పశ్చిమ బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా కొనసాగుతున్న వాయుగుండం
  • పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ను ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. వరదలు బీభత్సం సృష్టించాయి. తాజాగా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతోందని పేర్కొంది. దీని కాణంగా ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.


More Telugu News