హుస్సేన్ సాగర్‌లో ముగిసిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
- ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద గణేశుడి నిమజ్జనం
- ఉదయం ఖైరతాబాద్ నుంచి ప్రారంభమైన భారీ శోభాయాత్ర
- గణనాథుడిని చూసేందుకు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
హుస్సేన్ సాగర్ లో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ముగిసింది. హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద ఈ భారీ గణేశుడిని నిమజ్జనం చేశారు. అంతకుముందు, నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి ఎన్టీఆర్ మార్గ్ వద్దకు చేరుకుంది. ఈ శోభాయాత్రలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు. శోభాయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
గణనాథుల నిమజ్జనం నేపథ్యంలో వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకుంటున్నాయి. నిమజ్జనం వేడుకను చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఐమాక్స్ మార్గాలు గణనాథులు, భక్తులతో కిక్కిరిసిపోయాయి.