జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అదృష్టవంతుడు: సుమన్
- ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎన్టీఆర్ 'దేవర'
- విడుదలకు ముందే పలు రికార్డులు సాధించిన సినిమా
- ఒక ఆర్టిస్ట్ గా ఏం చేయాలనేది తారక్ కు బాగా తెలుసన్న సుమన్
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన 'దేవర' చిత్రం ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందే ఈ సినిమా పలు రికార్డులు సృష్టిస్తోంది. బుక్ మై షోలో 'పుష్ప 2'ను దాటేసింది.
మరోవైపు సీనియర్ నటుడు సుమన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. తారక్ చాలా అదృష్టవంతుడని ఆయన అన్నారు. విడుదలకు ముందే సినిమా ఇన్ని రికార్డులు సాధించడమంటే సామాన్య విషయం కాదని చెప్పారు. అందరు నటులకు ఇది సాధ్యం కాదని అన్నారు. తారక్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్సర్ అని... ఆయన ఏ డ్యాన్స్ చేసినా గ్రేస్ ఉంటుందని చెప్పారు. డైలాగ్స్ చెప్పడం తారక్ కు చిన్నప్పటి నుంచి అలవాటేనని అన్నారు.
ఒక ఆర్టిస్ట్ గా తెరపై ఏం చేయాలనేది ఆయనకు బాగా తెలుసని చెప్పారు. అందరితో చాలా స్నేహపూర్వకంగా ఉంటారని... ప్రతి సన్నివేశాన్ని టీమ్ తో చర్చిస్తారని కితాబునిచ్చారు. సినిమాకు సంబంధించి సలహాలు, సూచనలు కూడా ఇస్తారని తెలిపారు. తారక్ తో మరోసారి కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయని... సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.
ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మించారు. జాన్వీ కపూర్, చైత్ర రాయ్, సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, మురళి శర్మ కీలక పాత్రలు పోషించారు.