ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసులలో పోడియాల తొలగింపు
--
ఆంధ్రప్రదేశ్ లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో పారదర్శక సేవలందించేందుకు టీడీపీ సర్కారు మార్పులు చేపట్టింది. ప్రజలతో స్నేహపూర్వక వాతావరణం కల్పించడంలో భాగంగా ఉన్నతాధికారులు కార్యాలయాల్లో పలు మార్పులు చేస్తున్నారు. కోర్టులలో న్యాయమూర్తులు కూర్చునే పోడియాల తరహాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో నిర్మించిన భారీ పోడియాలను తొలగిస్తున్నారు. ఈ పోడియాలలో కూర్చుని అధికారులు విధులు నిర్వహించేవారు. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ ఆనవాయితీకి అధికారులు చెక్ పెడుతున్నారు.
రిజిస్ట్రేషన్ ఆఫీసులలో అధికారులు, ప్రజలకు మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాచరిక పోకడకు నిదర్శనంగా కనిపించే ఈ పోడియాలను అందుకే తొలగిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులలో పోడియాలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ జిల్లాలోని పటమట, గుణదల, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులలో అధికారులు యుద్ధప్రాతిపదికన పోడియాలను తొలగించారు. గుణదల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డయాస్, దానిచుట్టూ ఉన్న చెక్క పార్టీషనింగ్, ఎరుపు రంగు క్లాత్ లను ఏకంగా రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆర్ పీ సిసోడియా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ ఐజీ శ్రీధర్ బాబులు స్వయంగా తొలగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కూడా పాల్గొన్నారు.