'నీకు బాగా తెలిసిన ఆ పని చేసుకోవడం మంచిదమ్మా చిట్టి'.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సెటైర్!
- కంప్యూటర్‌ను ఈ దేశానికి తెచ్చిందే రాజీవ్ గాంధీ అన్న సీఎం
- కంప్యూటర్‌ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ అంటూ కేటీర్ సెటైర్
- దేశానికి కంప్యూటర్ ను పరిచయం చేసిందీ రాజీవ్ కాదు టీఐఎఫ్ఆర్ఏసీ వారు అని కౌంటర్
సీఎం రేవంత్ రెడ్డి కంప్యూటర్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సెటైర్లు వేశారు.
"కంప్యూటర్‌ను కనిపెట్టింది రాజీవ్ గాంధీ కాదు చార్లెస్ బాబేజీ. దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిందీ రాజీవ్ కాదు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఆటోమేటిక్ కాలిక్యులేటర్ (టీఐఎఫ్ఆర్ఏసీ) వారు 1956లో ఇండియాలో తొలిసారిగా కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్ గాంధీకి అప్పటికి 12 ఏళ్లు. ఏదో నోటికొచ్చింది వాగడం, ఆ తర్వాత దొరికిపోవడం ఎందుకు నీకు బాగా తెలిసిన రియల్ ఎస్టేట్ దందాలు, బ్లాక్ మెయిల్ వీటికి పరిమితమైతే మంచిదమ్మా చిట్టి" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా, సోమవారం రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. "ఇప్పుడు ట్విట్టర్ పిట్ట ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నాడు. అమెరికా వెళ్లి కంప్యూటర్ చదువుకున్నా అని చెబుతున్నాడు. ఆ కంప్యూటర్‌ను ఈ దేశానికి తెచ్చిందే రాజీవ్ గాంధీ. ఆయన లేకపోతే నువ్వు గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునేవాడివి. సిద్దిపేట రైల్వే స్టేషన్‌లో చాయ్, సమోసా అమ్ముకునేవాడివి" అని కేటీఆర్‌పై ముఖ్యమంత్రి సెటైర్ వేశారు.