ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం
నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఈ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. వినాయకుడికి కమిటీ సభ్యులు హారతి ఇచ్చి దీన్ని ప్రారంభించారు. భారీ జనసందోహం మధ్య ట్యాంక్‌బండ్ వైపు కదులుతున్నాడు.
రెండున్నర కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా సప్తముఖ మహాగణపతి ట్యాంక్‌బండ్ చేరుకుంటాడు. మధ్యాహ్నం ఒకటి, రెండు గంటల లోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మహాగణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.
మరోవైపు బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ఉదయం 9 గంటల తర్వాత ప్రారంభం కానుంది. దీనికంటే ముందు లడ్డూ వేలం వుంటుంది. ఈ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ. 27లక్షల భారీ ధర పలికిన విషయం తెలిసిందే.