రేపు, ఎల్లుండి రెండ్రోజులు అక్కడ మద్యం దుకాణాలు బంద్
- గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసుల ఉత్తర్వులు
- హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో దుకాణాలు బంద్
- ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని నిర్ణయం
హైదరాబాద్ మందుబాబులకు అలర్ట్!! గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 17, 18 తేదీలలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని నగర సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
రేపు (సెప్టెంబరు 17) ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి (సెప్టెంబరు 18) సాయంత్రం ఆరు గంటల వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో మద్యం షాపులను మూసేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైన్స్, కల్లు దుకాణాలు, బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు.