వనపర్తి దేవాలయంలోనే ఈ తారలు వివాహం ఎందుకు చేసుకున్నారో తెలుసా?
- సింపుల్‌గా జరిగిన నటుడు సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావుల వివాహం
- ఇరు కుటుంబాల అంగీకారంతోనే పెళ్లి
- వైరల్‌గా మారిన పెళ్లి ఫోటోలు
నటుడు సిద్ధార్థ్, కథానాయిక అదితిరావు హైదరిలు గత కొంతకాలంగా ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. తమ ప్రేమ గురించి పలు సార్లు బహిరంగంగానే ప్రకటించిన ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రెండు కుటుంబాల పెద్దల సాక్షిగా తెలంగాణలోని వనపర్తి పట్టణంలోని రంగనాయక స్వామి దేవాలయంలో వీరి వివాహం జరిగింది.
కథానాయిక అదితిరావు కుటుంబం వనపర్తికి చెందిన రాజుల కుటుంబం కావడంతో తన వివాహాన్ని వనపర్తిలో జరుపుకుంటానని గతంలో కూడా అదితిరావు చెప్పారు.
అయితే అదితిరావు కుటుంబానికి ఈ ఆలయంతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిసింది. అంతేకాదు అదితి వాళ్ల నానమ్మకు ఇచ్చిన మాట ప్రకారం ఈ దేవాలయంలో ఆమె పెళ్లి చేసుకున్నారని తన సన్నిహితులు చెబుతున్నారు. పెద్దవాళ్లకు ఇచ్చిన మాట, సొంత ఊరుపై మమకారంతో ఇంత సింపుల్‌గా, సంప్రదాయ పద్దతుల్లో అదితిరావు వివాహం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
మహాసముద్రం సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారటం ఇప్పుడు ఆ బంధం భార్యభర్తల అనుబంధంగా మారింది.
బాయ్స్ చిత్రంతో సిద్ధార్థ్ తెలుగు తెరకు పరిచయయ్యాడు. ఆ తరువాత నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, ఆట తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవల సిద్ధు నటించిన భారతీయుడు-2 ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
అదితిరావు హైదరి తెలుగులో సమ్మోహనం, మహా సముద్రం, అంతరిక్షం వంటి చిత్రాలతో తెలుగులో నాయికగా గుర్తింపు తెచ్చకున్నారు.