పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం... డ్ర‌గ్స్ కేసులో మీడియాపై న‌టి హేమ సీరియ‌స్‌!

పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం... డ్ర‌గ్స్ కేసులో మీడియాపై న‌టి హేమ సీరియ‌స్‌!
  • బెంగళూరు రేవ్ పార్టీలో మాద‌క‌ద్ర‌వ్యాలు తీసుకున్న‌ట్లు హేమపై కేసు
  • తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారంటూ న్యూస్ ఛానెళ్ల‌పై హేమ మండిపాటు
  • పాత వార్త‌ల‌ను తీసుకువ‌చ్చి  ప్ర‌చారం చేస్తున్నాయంటూ సీరియ‌స్‌
  • సోష‌ల్ మీడియా వేదిక‌గా వీడియో విడుద‌ల చేసిన హేమ‌
తెలుగు న‌టి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో మాద‌క‌ద్ర‌వ్యాలు తీసుకున్న‌ట్లు పోలీసులు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆమె డ్రగ్స్‌ తీసుకున్నట్టు నివేదికలో పేర్కొన్న పోలీసులు ఎండీఎంఏ మెడికల్‌ రిపోర్ట్‌ను కూడా జత చేశారు. 

ఇక, ఈ కేసులో నటి హేమతో స‌హా 88 మంది డ్రగ్స్‌ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. అలాగే చార్జీషీట్‌లో ఈ రేవ్‌ పార్టీ నిర్వాహకులుగా తొమ్మిది మందిని చేర్చారు.

అయితే తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారంటూ న్యూస్ ఛానెల్స్‌పై హేమ తాజాగా సీరియ‌స్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఒక వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. తాను డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు గ‌తంలో ప‌లు మీడియా ఎలా ఛానళ్లు ప్ర‌చారం చేశాయో, ఇప్పుడు మ‌ళ్లీ అదే పాత వార్త‌ల‌ను తీసుకువ‌చ్చి  ప్ర‌చారం చేస్తున్నాయంటూ ఆమె మండిప‌డ్డారు. 

హేమ‌కు డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వ‌చ్చిందంటూ ఫేక్ న్యూస్ ప్ర‌చారం చేస్తున్నారని మీడియాను దుయ్య‌బ‌ట్టారు.  పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ తానే ఇంకా చూడ‌లేద‌ని చెప్పిన హేమ‌.. మీరు ఎలా చూశారంటూ మీడియాపై చిందులుతొక్కారు. 

తానే స్వయంగా మీడియా సంస్థ‌ల వద్దకు వస్తానని, వారే ప‌రీక్ష‌ చేయించాలని ఈ సంద‌ర్భంగా హేమ సవాల్ విసిరారు. డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎంతటి శిక్షకు అయిన రెడీ అన్నారు. ఒక‌వేళ‌ నెగిటివ్ వస్తే మాత్రం తనకు న్యాయం చేయాలన్నారు. 

పరువు కోసం చచ్చిపోవడానికైనా సిద్ధమని హేమ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం హేమ‌కు సంబంధించిన ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.




More Telugu News