జస్ప్రీత్ బుమ్రాలాంటి బౌలర్ తరానికొక్కరే ఉంటారు: ఆర్ అశ్విన్
- భారత్ ఎప్పుడూ బ్యాటర్ల ఆధిపత్యం కలిగిన దేశమన్న అశ్విన్
- కానీ బౌలర్ అయిన బుమ్రాకు కూడా గౌరవం దక్కుతుండటం ఆనందంగా ఉందని వ్యాఖ్య
- అతడు 'ఒక తరం బౌలర్' అని కితాబు
- అలాంటి వారి గొప్పదనాన్ని అందరూ గుర్తించాలన్న లెజెండరీ స్పిన్నర్
టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన తోటి బౌలర్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు. అతడు 'ఒక తరం బౌలర్' అని కితాబునిచ్చాడు. అలాంటి బౌలర్ తరానికొక్కరే వస్తారని, వారి గొప్పదనాన్ని అందరూ గుర్తించాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
"భారత్ ఎప్పుడూ బ్యాటర్ల ఆధిపత్యం కలిగిన దేశం. అది ఎప్పటికీ మారదు. కానీ బౌలర్ అయిన బుమ్రాకు కూడా గౌరవం దక్కుతుండటం ఆనందంగా ఉంది. అతడు 'ఒక తరం బౌలర్'. నా దృష్టిలో ప్రస్తుతం అతడే అత్యంత విలువైన భారత క్రికెటర్. బుమ్రా విషయంలో మనం ఇంకా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవాలి" అని అశ్విన్ అన్నాడు.
ఇక ఇటీవల చెన్నైలో ఒక కార్యక్రమం కోసం జస్ప్రీత్ బుమ్రా వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బుమ్రాకు చెన్నై ప్రజలు బ్రహ్మరథం పట్టారని అశ్విన్ తెలిపాడు. తాము బ్యాటర్ల మాదిరే బౌలర్లను కూడా అభిమానిస్తామని చెప్పాడు.
"మా చెన్నై ప్రజలు బౌలర్లను చాలా అభిమానిస్తారు. 4-5 రోజుల క్రితం బుమ్రా ఒక ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చాడు. అతనికి మేము రజనీ ట్రీట్‌మెంట్ ఇచ్చాం. మేము బౌలర్లను చాలా చక్కగా చూస్తాం. అతన్ని ఛాంపియన్‌గా చూడాలి. అలాంటి బౌలర్ తరానికొక్కరే వస్తారు. బుమ్రా ప్రస్తుతం భారత్‌లో అత్యంత విలువైన క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారి గొప్పదనాన్ని అందరూ గుర్తించాలి" అని అశ్విన్ ఒక యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
ఇక జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పూర్తిగా విశ్రాంతి తీసుకున్న ఈ స్పీడ్‌స్టర్ ఇప్పుడు ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం బరిలోకి దిగుతున్నాడు. ఇక 2018లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన బుమ్రా ఇప్పటివరకు 36 మ్యాచులాడి 159 వికెట్లు పడగొట్టాడు.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ , మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.