ట్రంప్‌పై కాల్పులకు యత్నించిన వ్యక్తి గుర్తింపు.. అతనో నిర్మాణ కార్మికుడిగా పేర్కొన్న యూఎస్ మీడియా!
- ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా ఘటన
- తుపాకీతో ఉన్న వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు
- అతడిని హవాయి నివాసి ర్యాన్ వెస్లీ రౌత్‌గా గుర్తింపు
- నార్త్ కరోలినాలో నిర్మాణ కార్మికుడిగా పనిచేసిన రౌత్
- ట్రంప్ సురక్షితంగా ఉన్నందుకు సంతోషిస్తున్నానన్న కమలా హ్యారిస్
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు సమీపంలో కాల్పుల కలకలం చెలరేగిన సంగతి విదితమే. ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్టులో ఆయన ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా ఈ కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీసెస్ ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించింది. తుపాకీతో ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
కాగా, మాజీ అధ్యక్షుడిపై హత్యకు యత్నించిన వ్యక్తిని ర్యాన్ వెస్లీ రౌత్ (58)గా గుర్తించినట్లు అమెరికా మీడియా పేర్కొంది. హవాయి నివాసి అయిన రౌత్.. నార్త్ కరోలినాలో నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) ఈ ఘటనను 'హత్యా ప్రయత్నం'గా పరిగణిస్తున్నట్లు తెలిపింది.
"ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో జరిగిన ఘటనపై ఎఫ్‌బీఐ వెంటనే స్పందించింది. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది" అని ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక ఘటనాస్థలిలో ఏకే-47 స్టైల్ రైఫిల్, సిరామిక్ టైల్‌తో నిండిన రెండు బ్యాక్‌ప్యాక్‌లు, ఓ గోప్రో కెమెరాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, కేవలం రెండు నెలల వ్యవధిలో ట్రంప్‌పై ఇది రెండో హత్యాయత్నం కావడం గమనార్హం. జులై 13న పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన కాల్పుల్లో మాజీ అధ్యక్షుడి కుడి చెవికి దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇక వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఆదివారం రెండో ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి రక్షణగా అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ మాజీ ప్రెసిడెంట్ కంటే ముందు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో చుట్టూ వున్న దట్టమైన చెట్టుల ఆకుల నుంచి తుపాకీ బయటకు రావడం గుర్తించినట్లు సమాచారం.
అయితే, ఏజెంట్ ఆ దిశగా వెళ్లగా, అనుమానితుడు కాల్పులు జరిపాడా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. కానీ అతను మాజీ అధ్యక్షుడికి దాదాపు 350 నుండి 500 గజాల దూరంలో ఉండి కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ట్రంప్ ఏమన్నారంటే...
"నా పరిసరాల్లో తుపాకీ కాల్పులు జరిగాయి. నేను సురక్షితంగా ఉన్నాను. బాగానే ఉన్నాను. ఇలాంటివి ఏవీ నన్ను ఆపలేవు. నేను ఎప్పటికీ లొంగిపోను అని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు.
వైట్ హౌస్ కీలక ప్రకటన..
ఇక ఈ ఘటనపై వాషింగ్టన్ డీసీలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌లకు సమాచారం అందించడం జరిగిందని వైట్ హౌస్ ప్రకటించింది. "అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలికి భద్రత గురించి వివరించాం. మాజీ అధ్యక్షుడు ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్స్‌లో ఈ ఘటన జరిగింది. ఆయన క్షేమంగా ఉన్నారని తెలియడంతో వారు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించడం జరిగింది" అని వైట్ హౌస్ తన ప్రకటనలో పేర్కొంది.
ట్రంప్ సురక్షితంగా ఉన్నందుకు సంతోషిస్తున్నా: కమలా హ్యారిస్
మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సమీపంలో కాల్పులు జరగడాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. మాజీ అధ్యక్షుడికి సమీపంలో కాల్పులు జరిగినట్లు నాకు నివేదికలు అందాయి. ఆయన సురక్షితంగా ఉన్నందుకు సంతోషిస్తున్నా. అమెరికాలో హింసకు తావు లేదు" అని కమలా ట్వీట్ చేశారు.