వినాయకుడి నిమజ్జనంలో జగన్ పాటలు... వైసీపీ జెండాల ప్రదర్శన

  • అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో ఘటన
  • డీజేలో ‘కావాలి జగన్.. రావాలి జగన్’ పాటలు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
  • పాటలు వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
వినాయక నిమజ్జనం సందర్భంగా అన్నమయ్య జిల్లా బి. కొత్తకోటలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కీర్తిస్తూ మైక్‌లో పాటలు పెట్టినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక పోకనాటి వీధిలో ఏర్పాటు చేసిన వినాయకుడిని 13న నిమజ్జనం చేశారు. అంతకుముందు ప్రారంభమైన ఊరేగింపు సందర్భంగా ‘కావాలి జగన్.. రావాలి జగన్’ అనే పాటలు వేశారు. అనంతరం కొందరు వైసీపీ జెండాలు ప్రదర్శించారు. గమనించిన టీడీపీ నేతలు కొందరు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

అప్పటికే అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా వైసీపీ పాటలు వేయడంతో వాటిని ఆపాలని స్థానికులు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో డీఎస్పీ, సీఐ అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘించి ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయ పాటలు వేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


More Telugu News