ఈ చిన్న టెక్నిక్‌తో ఎంత వాన పడిందో ఇంటి దగ్గర మీరే తెలుసుకోవచ్చు
మోస్తరు వర్షాలు, భారీ నుంచి అతి భారీ వానలు.. కుండపోత వర్షం.. ఈ పదాలు నిత్యం వార్తల్లో కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి. అన్ని సెంటిమీటర్లు.. ఇన్ని మిల్లీమీటర్ల వాన పడిందని వాతావరణ శాఖ కూడా ప్రకటిస్తుంటుంది. ఎంత వర్షపాతం కురుస్తుందో అంచనా వేసేందుకు ఐఎండీ థర్మోమీటర్, బారోమీటర్, రెయిన్ గేజ్ లాంటి పరికరాలను ఉపయోగిస్తుంది. వీటి సహాయంతో వర్షపాతం లెక్కలను చెబుతుంది. ఈ అంచనాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న అబ్జర్వేటరీలు నిత్యం సమాచారాన్ని సేకరించి నేషనల్ క్లైమేట్ సెంటర్‌కు పంపిస్తుంటాయి. అయితే ఎంత వర్షపాతం నమోదయిందనేది ఎవరికి వారే ఇంటి వద్దే లెక్కించవచ్చని చాలామందికి తెలియదు. ఇంటి వద్దే వర్షపాతం లెక్కింపునకు 2 మార్గాలు ఉన్నాయి. అవి ఏంటి, ఏవిధంగా లెక్కించాలనే ఆసక్తికర విషయాలను ‘ఏపీ7ఏఎం’ అందిస్తున్న ఈ వీడియోను పూర్తిగా వీక్షించి తెలుసుకోండి.