అలాంటి వాటికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు: పోచారం శ్రీనివాస్ రెడ్డి
- వ్యవసాయ శాఖ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం
- దేశానికి, రాష్ట్రానికి రైతే వెన్నుముక అన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి
- రైతును బాగా చూసుకుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని వ్యాఖ్య
రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, ప్రాజెక్టులు పూర్తి చేయడం లాంటి వాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా ఆయన బాధ్యతలను స్వీకరించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ ఉద్యానవన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... దేశానికి, రాష్ట్రానికి రైతే వెన్నుముక అన్నారు. రైతుల కష్టాలను తీర్చేలా ప్రభుత్వం, అధికారులు కృషి చేయాలని సూచించారు.
దేశానికి అన్నం పెట్టేవాడు రైతు అని, అలాంటి రైతును బాగా చూసుకుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవంతో సలహాలు ఇస్తానన్నారు.