ఎమ్మెల్యేలు బజారున పడి కొట్టుకోవడం బాధగా ఉంది: మల్లు భట్టి విక్రమార్క
- గాంధీ, కౌశిక్ రెడ్డిల వివాదంపై మల్లు భట్టి స్పందన
- శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని వ్యాఖ్య
- ప్రతిపక్ష నేతలపై తమకు గౌరవం ఉందన్న డిప్యూటీ సీఎం
ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఎమ్మెల్యేలు రోడ్డెక్కి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు.
డిప్యూటీ సీఎం ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షాన్ని గౌరవించాలనే తాము సంయమనం పాటించామని భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని... కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా సీఎల్పీ సీటును కూడా లాక్కున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాదిరిగా తాము వ్యవహరించడం లేదని చెప్పారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతుక ఉండాలనే తాము కోరుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేతలపై తమకు గౌరవం ఉందని చెప్పారు.