హైడ్రా చట్టబద్ధతపై కీలక వ్యాఖ్యలు చేసిన కమిషనర్ రంగనాథ్

హైడ్రా చట్టబద్ధతపై కీలక వ్యాఖ్యలు చేసిన కమిషనర్ రంగనాథ్
  • హైడ్రా చట్టబద్ధతపై త్వరలో ఆర్డినెన్స్ రానుంది వెల్లడి
  • కొంతమంది హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్య
  • కార్యనిర్వాహక తీర్మానం ద్వారానే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడి
హైడ్రాకు చట్టబద్ధతను కల్పిస్తూ త్వరలో ఆర్డినెన్స్ రానుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కొంతమంది హైడ్రా చట్టబద్ధతపై ప్రశ్నిస్తున్నారని, కానీ ఇది చట్టబద్ధమైనదేనని స్పష్టం చేశారు. కార్యనిర్వాహక తీర్మానం ద్వారా హైడ్రాను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆ మేరకు జీవో నెం.99 ద్వారా జులై 19న హైడ్రా ఏర్పాటైందని వివరించారు.

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ అక్టోబర్ నెల లోపు ఆర్డినెన్స్ రానుందన్నారు. హైడ్రాకు విశేష అధికారాలు కూడా రాబోతున్నాయని తెలిపారు. ఆరు వారాల తర్వాత అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని, మున్సిపాలిటీలు, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు సహకారం అందిస్తామన్నారు. గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా పని చేస్తుందని వివరించారు.


More Telugu News