మా నాన్న పులిని చంపి, ఆ ర‌క్తం నా ముఖంపై పూశారు: యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్

  • ఇటీవ‌ల ధోనీ, క‌పిల్‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్తల్లో నిలిచిన యోగ్‌రాజ్
  • త‌న‌ క్రికెట్ అకాడమీలో శిక్ష‌ణ పొందాలంటే ప్లేయ‌ర్‌ మైండ్ సెట్ ఎలా ఉండాలో చెప్పిన యోగ్‌రాజ్
  • దానికి త‌న చిన్న‌నాటి క‌థ‌ను జోడించిన వైనం
టీమిండియా మాజీ క్రికెట‌ర్‌ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ఇటీవ‌ల వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం భార‌త మాజీ ఆట‌గాళ్లు ఎంఎస్ ధోనీ, క‌పిల్ దేవ్‌ల‌పై యోగ్‌రాజ్ నోరుపారేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక యోగ్‌రాజ్ సింగ్‌ ఆటగాడిగా అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా, కోచ్‌గా తన కుమారుడిని ప్రపంచ ఛాంపియన్‌గా తీర్చిదిద్దాడు.  

లిటిల్ మాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్‌ కూడా అతని వద్ద శిక్షణ పొందాడు. యోగ్‌రాజ్ సింగ్‌కి ఒక క్రికెట్‌ అకాడమీ ఉంది. దాని వీడియోలు సోషల్ మీడియాలో ఉంటాయి. ఆ వీడియోలలో యోగ్‌రాజ్ సింగ్ ప్లేయ‌ర్లకు ఇచ్చే శిక్ష‌ణ చూస్తే ఒక హార్డ్ టాస్క్ మాస్టర్ అనే భావన క‌ల‌గ‌క‌మాన‌దు. ఈ క్ర‌మంలో ఇటీవల ఆయ‌న‌కు త‌న క్రికెట్‌ అకాడమీ గురించి ఓ ప్ర‌శ్న ఎదురైంది. 

"ఎవరైనా మీ అకాడమీలో చేరాలనుకుంటే, ఆ ప్లేయ‌ర్‌ ఏ మైండ్ సెట్‌తో రావాలి?" అని యోగ్‌రాజ్ సింగ్‌ను ప్రశ్నించారు. ఈ ప్ర‌శ్న‌కు యోగ్‌రాజ్ త‌న‌దైన శైలిలో స‌మాధానం చెప్పారు. త‌న వ‌ద్ద కోచింగ్‌లో చేరాలంటే చావుపై భ‌యం వ‌దిలేయాల‌ని అన్నారు. 

ఇంకా మాట్లాడుతూ.. "మొదట మరణ భయం వీడాలి. నాకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు మా నాన్న మా అమ్మతో చెప్పారు మేము పులుల వేటకు వెళ్తున్నాం అని. దాంతో మా అమ్మ భయపడిపోయింది. చిన్నపిల్లోడిని వేట‌కు ఎందుకు అని వారించింది. కానీ, మా నాన్న చెప్పాడు.. అతను చనిపోతే అది గెలుస్తుంది. కానీ అతన్ని పులిలా పెంచుతాను అని. 

మా నాన్న నన్ను అలాగే మా అమ్మను పులి వేటకు తీసుకెళ్లారు. మా నాన్న ఓ పెద్ద తుపాకీ పట్టుకొచ్చారు. రాత్రి సమయంలో మేమందరం ఓ మంచెపై కూర్చున్నాం. అదే సమయంలో ఓ పులి మా దగ్గరికి వచ్చింది. దాన్ని చూసి నేను ఒక్కసారిగా అరిచా. వెంటనే మా అమ్మ తన చేతితో నా నోరు మూసేసింది.

అప్పుడు మా నాన్న పులిని ఆరడుగుల దూరం నుండి సరిగ్గా దాని తలమీదకి గురిపెట్టి కాల్చి చంపాడు. అదంతా చూసి నాకు మాటలు రాలేదు. నన్ను కిందికి దించమని మా అమ్మకు చెప్పారు. ఆ తర్వాత నన్ను పులి మీద కూర్చోబెట్టి దాని రక్తాన్ని నా పెదవుల మీదా, నుదుటిపైనా పూశాడు. ఇప్పటికీ ఆ ఫోటో మా ఇంట్లో ఉంది. ఆ స‌మ‌యంలో ఆయ‌న నాతో ఒక మాట చెప్పారు. పులికూన ఎప్పుడూ గ‌డ్డి తిన‌ద‌ని. 

అలా ఇద్ద‌రం వేట‌కు వెళ్లాం. అప్పుడు మా నాన్న పులిని ఆరడుగుల దూరం నుండి కాల్చి చంపాడు. ఆ తర్వాత నన్ను పులి మీద కూర్చోబెట్టి దాని రక్తాన్ని నా పెదవుల మీదా, నుదుటిపైనా పూశాడు. ఇప్పటికీ ఆ ఫోటో మా ఇంట్లో ఉంది. ఆ స‌మ‌యంలో ఆయ‌న నాతో ఒక మాట చెప్పారు. పులికూన ఎప్పుడూ గ‌డ్డి తిన‌ద‌ని. ఆ మాట నేనెప్ప‌టికీ మ‌ర్చిపోలేను. అందుకే నా కొడుకును కూడా భ‌యంలేనివాడిలా పెంచాను. నా అకాడమీ అలాంటిదని నేను అనుకుంటున్నాను" అని యోగ్‌రాజ్ సింగ్ త‌న‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. కాగా, యోగ్‌రాజ్ సింగ్ భారత్ తరఫున ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడాడు.


More Telugu News