కోహ్లీతో సీనియర్ నటి రాధిక సెల్ఫీ.. సోషల్ మీడియాలో ఫొటో వైరల్!
- లండన్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో కలుసుకున్న కోహ్లీ, రాధిక
- ఆ సమయంలో విరాట్‌తో సెల్ఫీ దిగిన సీనియర్ నటి
- ఆ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్న వైనం
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, తమిళ సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ లండన్ నుంచి చెన్నై వస్తున్న విమానంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా విరాట్‌తో ఆమె సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సెల్ఫీ ఇచ్చినందుకు రన్ మెషీన్‌కు రాధిక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విరాట్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు.
"లక్షలాది మంది హృదయాల్లో నిలిచిన వ్యక్తి కోహ్లీ. క్రికెట్‌కు కట్టుబడి దేశాన్ని గర్వ పడేలా చేశారు. అతనితో ట్రావెల్ చేయడం సంతోషాన్ని ఇచ్చింది. సెల్ఫీ దిగినందుకు థ్యాంక్స్" అంటూ రాధిక తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు.
ఇక ఈ నెల 19 నుంచి చెన్నైలోని చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు మ్యాచ్ కోసం శుక్రవారం విరాట్ కోహ్లీ చెన్నైకి చేరుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాప్రికాతో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత కోహ్లీ ఆడుతున్న సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్ ఇదే. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు అతను మిస్సయ్యాడు. కుమారుడు అకాయ్ పుట్టిన సందర్భంగా విరాట్ లండన్ వెళ్లిపోయాడు.
ఆ తర్వాత టీ20 ప్రపంచకప్, శ్రీలంకలో వన్డే సిరీస్ మాత్రమే ఆడాడు. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత అతను టెస్టుల్లో ఆడనున్నాడు. కాగా, టీ20 వరల్డ్ కప్‌తో పాటు శ్రీలంకతో వన్డేల్లో కూడా కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. పొట్టి ఫార్మాట్‌లో ఒక్క ఫైనల్ మ్యాచ్ తప్ప టోర్నీ మొత్తం విఫలమయ్యాడు.
ఇటీవల జరిగిన శ్రీలంక టూర్‌లోనూ నిరాశపరిచాడు. దీంతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు కోహ్లీ గాడిలో పడాలని, మునుపటిలా పరుగుల వరద పారించాలని అభిమానులు కోరుకుంటున్నారు.