ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు
- గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డి
- హత్యాయత్నం కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
- గాంధీ కుమారుడు, సోదరుడిపై కూడా కేసు నమోదు
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేశారు. గాంధీతో పాటు ఆయన కుమారుడు, సోదరుడిపై కూడా కేసు నమోదయింది. మరో ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్ లపై కూడా కేసు నమోదు చేశారు.
గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య నెలకొన్న వివాదం గత రెండు రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్న సంగతి తెలిసిందే. వివాదం మధ్యలోకి ప్రాంతీయత రావడంతో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది. ఆంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలను రాజేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తోందని గాంధీ ఆరోపించారు. సెటిలర్లను బీఆర్ఎస్ కు దూరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.