నాడు హైజాక్ అయిన ఆ విమానంలో ఆయన కూడా ఉన్నారు!: కేంద్ర మంత్రి జైశంకర్

  • స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి జై శంకర్ 
  •  1984లో జరిగిన విమాన హైజాక్ ఘటన గురించి వెల్లడి
  • ఆ విమానంలో తన తండ్రి కూడా ఉన్నారని చెప్పిన జై శంకర్
ప్రస్తుతం స్విట్టర్లాండ్ పర్యటనలో ఉన్న విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ .. జెనీవాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి .. 'ది కాంధార్ హైజాక్' సిరీస్ గురించి మాట్లాడుతూ గతంలో తన జీవితంలో జరిగిన షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. ఈ సిరీస్ తాను చూడలేదు కాబట్టి దానిపై తాను మాట్లాడలేనని పేర్కొన్న జై శంకర్ .. 1984లో కూడా ఒక హైజాక్ జరిగిందని, అప్పుడు తాను ఉద్యోగంలో చేరి కొంత కాలమే అవుతోందన్నారు. 

ఆ హైజాక్ ఘటనను డీల్ చేసే బృందంలో తాను కూడా ఉన్నానని చెప్పారు. దీంతో తాను ఇంటికి రావడం కుదరదని మా అమ్మకు ఫోన్ చేసి చెప్పానని, అయితే ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే .. హైజాక్ గురైన విమానంలో మా నాన్న కూడా ఉన్నారని తెలిసిందని, అదృష్టవశాత్తు విమానంలో ఉన్న వారికి ఏమీ కాలేదని తెలిపారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఒక వైవు హైజాక్‌కు సంబంధించి వ్యవహారాన్ని చూస్తోన్న బృందంలో పని చేస్తూ.. హైజాక్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కుటుంబ సభ్యుల్లోనూ తాను ఉన్నానని చెప్పారు. ఇంతకాలం ఎవరికీ పెద్దగా తెలియని ఈ విషయాన్ని చెప్పి మంత్రి అందరినీ ఆశ్చర్యపరిచారు.
 
అప్పుడు అసలు ఏమి జరిగింది అంటే..
1984 ఆగస్టు 24న భారత్ కు చెందిన విమానం ఐసీ 421 ధిల్లీ నుండి టేకాఫ్ అయి చండీగఢ్ లో ల్యాండ్ కాగానే ఏడుగురు హైజాకర్లు కాక్ పిట్ లోకి ప్రవేశించారు. జైర్నెల్ సింగ్ బింద్రన్ వాలేతో పాటు ఇతరులను విడుదల చేయాలని విమానాన్ని హైజాక్ చేసిన ఆల్ ఇండియా సిఖ్ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. 36 గంటల పాటు ఆ విమానాన్ని హైజాకర్లు నాలుగు విమానాశ్రయాల మధ్య తిప్పారు. అలా ఎంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య చివరకు అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారు.


More Telugu News