భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్క రోజే రూ. 1200 పెరుగుదల

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఒక్క రోజే రూ. 1200 పెరుగుదల
  • రెండు నెలల గరిష్ఠాన్ని తాకిన బంగారం ధరలు
  • దేశీయంగా ఊపందుకున్న కొనుగోళ్లు 
  • గత నాలుగు రోజుల్లో రూ. 5,200 పెరిగిన వెండి ధర
గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌తోపాటు దేశీయంగానూ కొనుగోళ్లు పెరగడంతో పుత్తడి ధరలు రెండు నెలల గరిష్ఠాన్ని తాకాయి. నిన్న ఒక్క రోజే పది గ్రాముల బంగారం ధరపై రూ. 1,200 పెరిగి రూ. 75,550కి చేరింది. అంతకుముందు ఈ ధర రూ. 74,350గా ఉంది. ఇక, హైదరాబాద్‌లో 99.9 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 1,300 పెరిగి రూ. 74,450కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 1200 పెరిగి రూ. 68,250కి చేరింది. 

గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధరలు నిన్న మరోమారు పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో నిన్న కిలో వెండిపై రూ. 2 వేలు పెరిగి రూ. 89 వేలకు చేరింది. గత నాలుగు రోజుల్లో కిలో వెండిపై ఏకంగా రూ. 5,200 పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లో ఈ ధర రూ. 95 వేలుగా నమోదైంది.


More Telugu News