ఓటీటీలోకి వస్తున్న 'మారుతీనగర్ సుబ్రమణ్యం'

ఓటీటీలోకి వస్తున్న 'మారుతీనగర్ సుబ్రమణ్యం'
  • ఆగస్టు నెలలో విడుదలైన మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా
  • ఈ నెల 20న సినిమా స్ట్రీమింగ్ అంటూ పోస్టర్ విడుదల 
లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ మారుతీనగర్ సుబ్రమణ్యం ఓటీటీ హక్కులను ఆహా సంస్థ తీసుకుంది. తాజాగా ఓటీటీలో రిలీజ్ డేట్ ను ఆ సంస్థ ఖరారు చేసింది. ఈ నెల 20 నుండి సినిమా స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడిస్తూ పోస్టర్ ను విడుదల చేసింది. 

ఈ మూవీ ఆగస్టులో థియేటర్లలో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత ఈ చిత్రానికి సమర్పకురాలిగా వ్యవహరించడం విశేషం. మధ్య తరగతికి చెందిన మధ్య వయస్కుడైన ఓ నిరుద్యోగి కష్టాల ఇతి వృత్తంగా ఈ సినిమాను సంస్థ రూపొందించిన విషయం తెలిసిందే. 


More Telugu News