భారీగా పెరగనున్న వంట నూనెల ధరలు!
- దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం పెంచిన కేంద్రం
- పామాయిల్ నుంచి సన్‌ఫ్లవర్ వరకు అన్నింటిపైనా భారం
- ఉల్లి ఎగుమతులపై సుంకాన్ని 20 శాతం తగ్గించిన ప్రభుత్వం
మధ్య తరగతి వంటింటి ఖర్చు ఇకపై మరింతగా పెరగనుంది. ముడి, రిఫైన్డ్ వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం ఒకేసారి 20 శాతం వరకు పెంచడంతో ఆ మేరకు వంటనూనెల ధరలు పెరగనున్నాయి. పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ సహా వివిధ రకాల నూనెలపై ఈ భారం పడనుంది. వీటి ముడి నూనెలపై ఇప్పటి వరకు సుంకం ఉండేది కాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 20 శాతం విధించడంతో పేద, మధ్య తరగతి జేబులకు చిల్లు పడనుంది.
రిఫైన్డ్ పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ నూనెలపై గతంలో 12.5 శాతం దిగుమతి సుంకం ఉండేది. దీనిని ఇప్పుడు 20 శాతం పెంచి 32.5 శాతం పెంచింది. ముడినూనెలపై సుంకాన్ని 27.5 శాతానికి, రిఫైన్డ్ నూనెలపై కస్టమ్స్ డ్యూటీని 35.75 శాతానికి పెంచింది. ఈ నెల 14 నుంచే ఇది అమల్లోకి రానుంది. అదే సమయంలో ఉల్లిపాయలపై ఎగుమతి సుంకం సగం తగ్గింది. ప్రస్తుతం 40 శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా దానిని 20 శాతానికి తగ్గించింది.