స్టాక్ మార్కెట్లపై ఏపీ, తెలంగాణ మదుపర్ల ఆసక్తి.. గణనీయంగా పెట్టుబడులు!
- దేశవ్యాప్త మదుపర్లలో ఏపీ, తెలంగాణ వాటా 6.8 శాతం
- స్థిరాస్తి కొనుగోలు కంటే స్టాక్స్‌లో పెట్టుబడులకే ఉత్తర భారతదేశ ప్రజల ఆసక్తి
- గత నాలుగేళ్లలో 186.20శాతం పెరిగిన ఏపీ వృద్ధి
- స్మార్ట్‌ఫోన్లలోనూ ట్రేడింగ్ అందుబాటులోకి రావడమే కారణం
తెలుగు రాష్ట్రాల నుంచి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న మదుపర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నెల 12 నాటికి దేశవ్యాప్తంగా 19,63,98,664 మంది పెట్టుబడులు పెట్టగా వారిలో ఆంధ్రప్రదేశ్ మదుపర్లు 87,08,753 మంది, తెలంగాణ నుంచి 43,28,231 మంది ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే వీరి సంఖ్య 6.8 శాతం.
ఇక దక్షిణ భారతదేశం నుంచి చూసుకుంటే గత జులై నాటికి స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గత నాలుగేళ్లలో 172 శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ వృద్ధి 186.20 శాతంగా నమోదైంది. ఉత్తర భారతదేశంలో ఎక్కువమంది స్థిరాస్తి, బంగారం కొనుగోలు కంటే షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో మదుపర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. తలసరి ఆదాయం పెరగడం, అంతరాయం లేని ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రావడం, స్మార్ట్‌ఫోన్లలో ట్రేడింగ్ సులభంగా మారడం, ఆధార్‌తో సులువుగా డీమ్యాట్ ఖాతా తెరిచే వీలుండడం వంటివి పెట్టుబడిదారుల సంఖ్య పెరగడానికి దోహదం చేస్తున్నట్టు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.