ఇకపై ఆ బాధ్యతలు ట్రాన్స్ జెండర్లకు...! రేవంత్ సర్కారు యోచన

  • హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య
  • రద్దీ సమయాల్లో వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు
  • ట్రాఫిక్ నియంత్రణకు వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో రోజురోజుకు ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ఉదయం, సాయంత్రం సమయాల్లో పలు ప్రదేశాల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాల సంఖ్య కూడా భారీగా పెరగడంతో వాహనదారులు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన చేశారు. హైదరాబాద్ సిటీలో ఫుట్ పాత్‌ల అభివృద్ధి, పరిశుభ్రత, ట్రాఫిక్ అంశాలపై నిన్న ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ విధుల నిర్వహణకు ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ సూచించారు. హోంగార్డు తరహాలో వారికి ఉపాధి అవకాశాలను కల్పించే అంశంపై పరిశీలన చేయాలన్నారు. ట్రాఫిక్ వాలంటీర్లుగా సేవలు అందించేందుకు ఆసక్తిగా ఉన్న ట్రాన్స్ జెండర్ల వివరాలను సేకరించాలని, వారి అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం రేవంత్ కోరారు.


More Telugu News