మ‌ళ్లీ బెంగ‌ళూరుకే జ‌గ‌న్.. లండ‌న్ ప‌ర్య‌ట‌న‌పై నో క్లారిటీ!

  • సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌గ‌న్ బెంగ‌ళూరు వెళ్ల‌డం ఇది తొమ్మిదోసారి
  • ఈ నెల 3 నుంచి 25 మ‌ధ్య లండ‌న్ వెళ్ల‌డం కోసం హైద‌రాబాద్ సీబీఐ కోర్టులో అనుమ‌తి
  • జ‌గ‌న్ పాస్‌పోర్టు రెన్యువ‌ల్ విష‌యంలో విజ‌య‌వాడ‌లోని ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు ష‌ర‌తులు
  • వాటిని ర‌ద్దు చేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన మాజీ సీఎం 
  • ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌టన‌పై సందిగ్ధ‌త‌
వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి బెంగ‌ళూరు వెళ్లారు. శుక్ర‌వారం పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న ఆ త‌ర్వాత నేరుగా బెంగ‌ళూరుకే వెళ్లిపోయారు. కాగా, సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ఆయ‌న బెంగ‌ళూరు వెళ్ల‌డం ఇది తొమ్మిదోసారి. 

దీంతో జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న‌పై సందిగ్ధ‌త నెల‌కొంది. ఈ నెల 3 నుంచి 25 మ‌ధ్య లండ‌న్ వెళ్ల‌డం కోసం ఆయ‌న చేసిన అభ్య‌ర్థ‌న మేర‌కు హైద‌రాబాద్ సీబీఐ కోర్టు అనుమ‌తి ఇచ్చింది. అయితే, జ‌గ‌న్ పాస్‌పోర్టు రెన్యువ‌ల్ విష‌యంలో విజ‌య‌వాడ‌లోని ప్ర‌జాప్ర‌తినిధుల ప్ర‌త్యేక న్యాయ‌స్థానం ష‌ర‌తులు విధించ‌డం జ‌రిగింది. 

వాటిని ర‌ద్దు చేయాలంటూ మాజీ సీఎం ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌టన‌ ఉంటుందా? ఉండ‌దా? అనే విష‌యంలో సందిగ్ధ‌త నెల‌కొంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.


More Telugu News