మంగళగిరిలో కరెన్సీ గణేశుడికి మంత్రి నారా లోకేశ్ పూజలు
- కొనసాగుతున్న వినాయకచవితి నవరాత్రులు
- మంగళగిరిలో మెయిన్ బజార్ వద్ద గణేశ్ మండపం ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యులు
- రూ.2.3 కోట్ల కరెన్సీ నోట్లతో విగ్రహాలంకరణ
- తొలి హారతి ఇచ్చిన నారా లోకేశ్
వినాయకచవితి నవరాత్రులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ మంగళగిరి మెయిన్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో పూజలు చేశారు.
ఈ మండపంలోని వినాయక విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గణేశుడిని రూ.2.3 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ కరెన్సీ గణేశ్ మండపాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్... గణలక్ష్మి, గణనాథుడికి తొలి హారతి ఇచ్చారు. ఈ గణేశ్ విగ్రహాన్ని మంగళగిరికి చెందిన ఆర్య వైశ్య సంఘాలు ఏర్పాటు చేశాయి.