కీలక మైలురాయిని విజయవంతంగా సాధించిన డీఆర్‌డీవో, నేవీ

వీఎల్ఎస్‌ఆర్‌ఎస్ఏఎం పరీక్ష విజయవంతం
తక్కువ ఎత్తులో పయనించే వైమానిక లక్ష్యాలను ఛేదించనున్న క్షిపణి
డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, నేవీ అధికారుల్లో వెల్లివిరిసిన ఆనందం
దేశ రక్షణ సామర్థ్యాల ఆధునికీకరణలో శుక్రవారం నాడు ముఖ్యమైన విజయం లభించించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీవో, భారత నావికాదళం ఉమ్మడిగా చేపట్టిన వీఎల్ఎస్‌ఆర్‌ఎస్ఏఎం (వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్) పరీక్ష విజయవంతమైంది. 

ఇవాళ ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డీఆర్‌డీవో శాస్ర్తవేత్తలు ఈ క్షిపణి పరీక్షను నిర్వహించారు. వరుసగా రెండవ పరీక్ష కూడా విజయవంతమవడంతో డీఆర్‌డీవో, నేవీ అధికారుల్లో ఆనందం వెల్లివిరిసింది. సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

సముద్ర ఉపరితలంపై చాలా తక్కువ ఎత్తులో అధిక వేగంతో పయనిస్తున్న వైమానిక లక్ష్యాన్ని క్షిపణి విజయవంతంగా ఛేదించింది. వీఎల్ఎస్‌ఆర్‌ఎస్ఏఎం పరీక్షకు సంబంధించిన రెండు వరుస ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో భారత రక్షణ సామర్థ్యాలు మరింత మెరుగయ్యాయి. సైనిక సాంకేతికతలో స్వావలంబన సాధించాలనే లక్ష్యంలో ఈ విజయం కీలకంగా నిలిచింది. 

కాగా, భారత రక్షణ దళాలు ఎప్పటికప్పుడు రక్షణ సామర్థ్యాలను ఆధునికీకరిస్తున్నాయి. అందులో భాగంగానే వీఎల్ఎస్‌ఆర్‌ఎస్ఏఎం ప్రాజెక్టును చేపట్టారు.


More Telugu News