ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో అరుదైన దృశ్యం... ఓకే ఫ్రేమ్‌లో 11మంది ఆట‌గాళ్లు... ఇదిగో వీడియో!

  • సోమర్సెట్, సర్రే జ‌ట్ల‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం
  • బౌలర్, వికెట్ కీపర్ కాకుండా మిగతా ఫీల్డర్లందరినీ బ్యాట‌ర్ పక్కనే నిల‌బెట్టిన సోమర్సెట్
  • ఆ స‌మ‌యంలో ఓకే ఫ్రేమ్‌లో సోమర్సెట్ జ‌ట్టులోని 11 మంది ప్లేయర్లు ద‌ర్శ‌నం
ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఛాంపియన్షిప్‌లో అరుదైన దృశ్యం ఆవిష్కృత‌మైంది. ఓకే ఫ్రేమ్‌లో 11 మంది ఆట‌గాళ్లు కనిపించారు. కౌంటీ ఛాంపియన్షిప్‌లో భాగంగా సోమర్సెట్- సర్రే జ‌ట్ల‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ దృశ్యం క‌నిపించింది. 

ఈ మ్యాచ్‌లో 221 పరుగుల ల‌క్ష్య‌ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన‌ సర్రే జట్టు 109/9 స్కోరు వద్ద నిలిచింది. ఇక మ్యాచ్‌ ఆఖరి రోజు మరో 3 నిమిషాల్లో ఆట ముగియాల్సి ఉంది. దీంతో వికెట్ కాపాడుకొని మ్యాచ్ ను డ్రాగా ముగించుకోవాలని సర్రే ప్రయత్నించింది. 

అదే సమయంలో ప్ర‌త్య‌ర్థి సోమర్సెట్ మంచి ప్లాన్ వేసింది. ఎలాగైన ఆఖరి వికెట్ తీసి మ్యాచులో విజేతగా నిలవాలని బౌలర్, వికెట్ కీపర్ కాకుండా మిగతా ఫీల్డర్లందరినీ (9 మంది) బ్యాటర్ డేనియల్ వోరాల్‌కు పక్కనే ఫీల్డింగ్‌ సెట్‌ చేసింది. ఇక లీచ్‌ వేసిన ఆ బంతిని బ్యాటర్ డేనియల్ అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు.

కానీ, బంతి నేరుగా బ్యాటర్ ప్యాడ్లను తాకింది. వెంటనే అంపైర్‌ అతడిని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో సర్రే 109 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా సోమర్సెట్ 111 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సందర్భంగా ఇద్దరు బ్యాటర్లతో కలిపి సోమర్సెట్ జ‌ట్టులోని 11 మంది ప్లేయర్లూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైరల్ అవుతోంది.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 317 పరుగులు చేసింది. తర్వాత సర్రే కూడా అద్భుతంగా ఆడింది. 321 పరుగులు చేసి నాలుగు పరుగులు లీడ్లో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో సోమర్సెట్ ను 224 పరుగులకు ఆలౌట్‌ చేసిన సర్రే లక్ష్య ఛేదనలో మాత్రం తడబడింది. సర్రే బౌలర్లలో బంగ్లాదేశ్ వెటరన్ షకీబ్ అల్ హసన్ 4 వికెట్లు పడగొట్టగా, డేనియల్ వోరాల్ మూడు వికెట్లు తీశాడు.

221 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో డోమ్ సిబ్లీ 183 బంతుల్లో 56 పరుగులు చేయడంతో సర్రేను ఆటలో నిలబెట్టింది. అయితే మ‌రో ఎండ్ నుంచి అతనికి ఇత‌ర బ్యాట‌ర్ల నుంచి మద్దతు ల‌భించ‌లేదు. ఆర్చీ వాన్, జాక్ లీచ్ చెరో 5 వికెట్లు తీశారు. దాంతో సర్రేను సోమర్సెట్ కేవలం 109 పరుగులకే కట్టడి చేసింది.


More Telugu News