హీరో సాయి దుర్గా తేజ్ పొలిటికల్ ఎంట్రీ వుంటుందా?
- సామాజిక సేవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్టొంటున్న మెగాహీరో
- మేనమామ పవన్ భావాలు, బాట అంటే అమితమైన ఇష్టం
- ఇటీవల విజయవాడలో వృద్ధాశ్రమానికి ఆర్థికసాయం
అగ్ర నటుడు చిరంజీవి మేనల్లుడుగా అరంగ్రేటం చేసిన సాయి దుర్గా తేజ్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్నాడు. డ్యాన్సుల్లో, హావాభావాలు పలికించడంలో మేనమామ చిరంజీవికి ఏ మాత్రం తీసిపోడు అని గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి దుర్గా తేజ్. గత సంవత్సరం జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా కెరీర్ వేగంను కాస్త తగ్గించిన ఈ మెగాహీరో త్వరలోనే రాజకీయ రంగంలోకి రాబోతున్నాడా? అనే చర్చ మొదలైంది.
ప్రస్తుతం రోహిత్ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సాయి ప్రస్తుతం సామాజిక సేవ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు. అంతేకాదు ఇటీవల తనతో పాటు తన మేనమామ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్ మీద ప్రతిపక్ష రాజకీయ నాయకులు చేస్తున్న విమర్శలకు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నాడు. వారికి కౌంటర్స్ కూడా ఇస్తున్నాడు. ఇటీవల విజయవాడ వెళ్లి అక్కడ వృద్దుల అనాథాశ్రమంలో కలిసి వారిని అప్యాయంగా పలకరించి తన వంతు సాయంగా ఐదు లక్షల విరాళాన్ని కూడా అందించాడు. దీంతో అందరూ త్వరలోనే ఈ మెగాహీరో రాజకీయ రంగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే చర్చ మొదలుపెట్టారు.
ఇక మేనమామ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఎలాగు వుంది.. ఆయన నడిచే బాట, భావాలు కూడా ఈ మెగా హీరోకి అమితమైన ఇష్టమే.. ఈ ప్రకారం చూస్తే సాయి దుర్గా తేజ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే పెద్దగా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.