బీఆర్ఎస్ బలం కార్యకర్తలేనని మరోసారి రుజువైంది: కేటీఆర్
- నిన్న ఉద్రిక్తతకు దారితీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య సవాళ్ల పర్వం
- పలువురు కీలక బీఆర్ఎస్ నేతల అరెస్టులతో ఉద్రిక్త పరిస్థితులు
- ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక ట్వీట్
- బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారంటూ మెచ్చుకున్న కేటీఆర్
బీఆర్ఎస్ నిజమైన బలం కేడర్‌లోనే ఉందని కార్యకర్తలు మరోసారి నిరూపించారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.
"నిన్నటి కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత చర్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు. రౌడీ మూకలు దాడి చేసినా, రాళ్ళు రువ్వినా, దాడులను ఆపవలసిన పోలీసులు చేతులు ముడుచుకున్నా ధైర్యంగా నిలబడి పోరాడారు. ఇలా ధైర్యంగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతిఒక్క సోదరుడికి, సోదరితో పాటు సోషల్ మీడియాలో అండగా నిలిచిన యోధులకి వందనాలు!
బీఆర్ఎస్ నిజమైన బలం మన దృఢమైన కేడర్‌లో ఉందని మన నిర్భయ కార్యకర్తలు మరోసారి నిరూపించారు. మనం అందరం కలిసి తెలంగాణ గర్వాన్ని, ఆత్మను, భవిష్యత్తును కాపాడుకుందాం జై బీఆర్ఎస్, జై తెలంగాణ" అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య మొదలైన సవాళ్ల పర్వం గురువారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. చివరికి అరెస్ట్‌ల వరకు వెళ్లింది.