సీపీ ఆఫీస్ వద్ద పోలీసులతో కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదం... సర్దిచెప్పి తీసుకెళ్లిన హరీశ్ రావు
- దాడికి సంబంధించి ఫిర్యాదు చేసేందుకు సీపీ కార్యాలయానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి ఫిర్యాదు
- లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి నేపథ్యంలో... ఫిర్యాదు చేసేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఓ పోలీసు అధికారితో కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదం జరుపుతుండగా హరీశ్ రావు ఆయనకు సర్దిచెప్పి సీపీ కార్యాలయంలోకి తీసుకువెళ్లారు.
కౌశిక్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సీపీ కార్యాలయానికి వెళ్లారు. సీపీ కార్యాలయం వద్ద మెట్లపై బైఠాయించి బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. కార్యాలయంలో సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి లిఖితపూర్వక ఫిర్యాదును అందించారు.
అరెస్ట్ చేసే వరకు వెళ్లేది లేదు
కౌశిక్ రెడ్డిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దగ్గరుండి దాడిని ప్రోత్సహించిన సీఐ, ఏసీపీలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీపీ... వెంటనే కార్యాలయానికి రావాలని నినాదాలు చేశారు.
కౌశిక్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు
అంతకుముందు, దాడి విషయం తెలిసిన హరీశ్ రావు హుటాహుటిన హైదరాబాద్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండించారు. ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.