సీతారాం ఏచూరి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సంతాపం
- తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి
- ఏచూరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి
- దేశ రాజకీయాల్లో ఏచూరి అత్యంత గౌరవనీయ వ్యక్తి అని వెల్లడి
- ఒక ప్రజా పోరాట యోధుడ్ని కోల్పోయామన్న నారా లోకేశ్
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సీతారాం ఏచూరి మృతి పట్ల చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు.
ఈ విషాద సమయంలో ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వెల్లడించారు. అట్టడుగు వర్గాల ప్రజలతో సీతారాం ఏచూరికి మంచి అనుబంధం ఉందని తెలిపారు. భారతదేశ రాజకీయాల్లో ఆయన అత్యంత గౌరవనీయ వ్యక్తి అని చంద్రబాబు అభివర్ణించారు. సీతారాం ఏచూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని వివరించారు.
వామపక్ష దిగ్గజం సీతారాం ఏచూరి మృతి పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా సంతాపం తెలియజేశారు. ఏచూరి మరణంతో ఒక ప్రజాపోరాట యోధుడిని కోల్పోయామని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలకే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి సీతారాం ఏచూరి అని కొనియాడారు. ఏచూరికి కన్నీటి నివాళులు అర్పిస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు.