విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం... హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్

  • రూ.261 కోట్ల విద్యుత్ బకాయిల చెల్లింపుపై వివాదం
  • విద్యుత్ కొనుగోలు బిడ్‌లో డిస్కంలు పాల్గొనకుండా అడ్డుకున్న డిస్పాచ్ సెంటర్
  • దీంతో హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం
బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ డిస్కమ్‌లు విద్యుత్ కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా నేషనల్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకుంది. రూ.261 కోట్ల బకాయిలు చెల్లించాలని పవర్ గ్రిడ్ ఫిర్యాదు చేసింది. దీంతో డిస్కమ్‌లను నేషనల్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకుంది. 

విద్యుత్ కొనుగోలు బిడ్‌లో పాల్గొనకుండా అడ్డుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ రొనాల్డ్ రాస్ వాదనల కోసం హైకోర్టుకు వెళ్లారు. 

విద్యుత్ బకాయిల చెల్లింపులకు సంబంధించి చాలాకాలంగా వివాదం కొనసాగుతోంది. మరోవైపు, తెలంగాణ డిస్కమ్‌లు ఈ విషయమై సీఈఆర్సీని ఆశ్రయించాయి.


More Telugu News