టాలీవుడ్‌లో విషాదం... ప్ర‌ముఖ గేయ‌ ర‌చ‌యిత క‌న్నుమూత‌!

  • ప్ర‌ముఖ తెలుగు సినీ గీత ర‌చ‌యిత గురుచ‌ర‌ణ్ మృతి
  • గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న గీత ర‌చ‌యిత 
  • ఆత్రేయ ద‌గ్గ‌ర శిష్య‌రికం.. రెండు వంద‌ల‌కు పైగా సినిమా పాట‌లు రాసిన గురుచ‌ర‌ణ్‌
  • ద‌ర్శ‌కుడు మానాపురపు అప్పారావు, న‌టి ఎంఆర్ తిలకం దంప‌తుల కుమారుడు
  • గురుచ‌ర‌ణ్ అస‌లు పేరు మానాపుర‌పు రాజేంద్ర‌ప్ర‌సాద్‌  
టాలీవుడ్‌లో విషాదం నెల‌కొంది. ప్ర‌ముఖ తెలుగు సినీ గీత ర‌చ‌యిత గురుచ‌ర‌ణ్ (77) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇవాళ తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు. 

ఆత్రేయ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేసిన గురుచ‌ర‌ణ్ దాదాపు రెండు వంద‌ల‌కు పైగా సినిమా పాట‌లు రాశారు. ఆయ‌న క‌లం నుంచి జాలు వారిన వాటిలో 'ముద్ద‌బంతి పువ్వులో మూగ‌బాస‌లు', 'బోయ‌వాని వేటుకు గాయ‌ప‌డిన కోయిల' వంటి ఎన్నో సూప‌ర్ హిట్స్ ఉన్నాయి. 

గురుచ‌ర‌ణ్ అస‌లు పేరు మానాపుర‌పు రాజేంద్ర‌ప్ర‌సాద్‌. ఆయన అల‌నాటి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మానాపురపు అప్పారావు, న‌టి ఎంఆర్ తిలకం దంప‌తుల కుమారుడు. 

న‌టుడు మోహ‌న్‌బాబుకు గురుచ‌ర‌ణ్ అంటే ప్ర‌త్యేక అభిమానం. అందుకే ఆయ‌న సినిమాలో క‌నీసం ఒక్క పాటైనా రాయించేవారు. గురుచ‌ర‌ణ్ మ‌ర‌ణ‌వార్త తెలుసుకుని ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.


More Telugu News