మహిళల వరల్డ్ కప్ లో వీళ్లకు ఫ్రీ ఎంట్రీ...!
- యూఏఈ వేదికగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్ టీ20 టోర్నీ
- అక్టోబర్ 3 నుంచి 20 వరకు మొత్తం 23 మ్యాచ్‌లు
- ఈ మ్యాచ్‌ల ప్రారంభ టికెట్ ధరను రూ. 114గా నిర్ణయించిన ఐసీసీ
- అలాగే 18 ఏళ్లలోపు వయసు కలిగిన వారికి ఫ్రీ ఎంట్రీ
యునైటెడ్ అరబ్ ఏమిరెట్స్ (యూఏఈ) వేదికగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్ టీ20 టోర్నీ జరగనుంది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు మొత్తం 23 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల టికెట్ ధరలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. ప్రారంభ ధరను 5 దిర్హమ్స్ (రూ. 114.28) గా నిర్ణయించింది. అలాగే 18 ఏళ్లలోపు వయసు కలిగిన వారికి ఫ్రీ ఎంట్రీ కల్పించింది.
ఇక యూఏఈలో ప్రపంచ నలుమూలలకు చెందిన ప్రజలు ఉంటారని, వారు మ్యాచులకు హాజరై తమ దేశ క్రికెటర్లకు మద్దతుగా నిలుస్తారని ఇలా ఉచిత ప్రవేశంతో పాటు తక్కువ ధరలకు టికెట్లు విక్రయించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ పేర్కొంది.
కాగా, ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో మొత్తం 10 దేశాలు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్‌తో పాటు న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ ఉంటే.. గ్రూప్-బీలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్, స్కాట్లాండ్ ఉన్నాయి. ఒక గ్రూప్‌లోని ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అలా టాప్-2లో నిలిచిన దేశాలు సెమీస్‌కు వెళ్తాయి.
టీమిండియా షెడ్యూల్ ఇలా..
అక్టోబర్ 4న భారత్ వర్సెస్ న్యూజిలాండ్
అక్టోబర్ 6న భారత్ వర్సెస్ పాకిస్థాన్
అక్టోబర్ 9న భారత్ వర్సెస్ శ్రీలంక
అక్టోబర్ 13న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా