కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి

  • ఆసియా ప‌సిఫిక్ స‌భ్య‌దేశాల ఛైర్మ‌న్‌గా రామ్మోహ‌న్‌నాయుడు ఎన్నిక‌
  • ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-ప‌సిఫిక్ మంత్రుల స్థాయి స‌ద‌స్సు
  • రామ్మోహ‌న్‌నాయుడి పేరును సింగ‌పూర్ ప్ర‌తిపాదించ‌గా బ‌ల‌ప‌రిచిన భూటాన్ 
  • త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం ప‌ట్ల రామ్మోహ‌న్‌నాయుడు హ‌ర్షం
కేంద్ర పౌర విమాన‌యాన‌శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడిని కీల‌క ప‌ద‌వి వ‌రించింది. ఆసియా ప‌సిఫిక్ స‌భ్య‌దేశాల ఛైర్మ‌న్‌గా ఆయ‌న ఎన్నిక‌య్యారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-ప‌సిఫిక్ మంత్రుల స్థాయి స‌ద‌స్సులో బుధ‌వారం ఆయ‌న ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. 

రామ్మోహ‌న్‌నాయుడి పేరును సింగ‌పూర్ ప్ర‌తిపాదించ‌గా భూటాన్ బ‌ల‌ప‌రిచింది. మిగ‌తా స‌భ్య‌దేశాల‌న్నీ ఆమోదం తెల‌ప‌డంతో ఆయ‌న ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది. దేశం త‌ర‌ఫున‌ త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం ప‌ట్ల రామ్మోహ‌న్‌నాయుడు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

దేశం త‌ర‌ఫున త‌న‌కు ద‌క్కిన ఈ గౌర‌వాన్ని తాను బాధ్య‌త‌గా స్వీక‌రిస్తాన‌ని అన్నారు. విమాన‌యాన రంగాన్ని సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు మ‌రింత అందుబాటులోకి తేవ‌డంతో పాటు స‌భ్య‌దేశాల మ‌ధ్య రాక‌పోక‌ల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేందుకు కృషి చేస్తాన‌ని తెలిపారు.


More Telugu News