అటవీ వనరుల రక్షణలో ప్రాణత్యాగం చేసిన వారికి నివాళులు అర్పిస్తున్నా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- నేడు జాతీయ అటవీ అమరవీరుల దినం
- అటవీ వనరుల రక్షణలో ప్రాణత్యాగం చేసిన వారికి పవన్ నివాళులు
- అమూల్యమైన సహజ సంపదను కాపాడుకునేలా ప్రతిజ్ఞ చేద్దామని పిలుపు
నేడు జాతీయ అటవీ అమరవీరుల దినం అని ఏపీ డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. అటవీ వనరుల రక్షణలో ప్రాణ త్యాగం చేసిన వారికి నివాళులు అర్పిస్తున్నానని తెలిపారు. బిష్ణోయ్ తెగ త్యాగాన్ని స్మరించుకుంటూ అటవీ అమరవీరుల దినం జరుపుకుంటున్నామని పవన్ పేర్కొన్నారు.
ఏపీలో ఎర్రచందనం, శ్రీగంధం వంటి విలువైన వృక్ష జాతులు ఉన్నాయని వెల్లడించారు. అత్యంత అరుదైన వన్యప్రాణులకు ఆవాసం మన అటవీ క్షేత్రాలు అని వివరించారు. అమూల్యమైన అటవీ సహజ సంపదను కాపాడుకునేలా ప్రతిజ్ఞ చేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.