త్రిష పాత ఇంట్లో ఇప్పుడు ఏ సీనియర్ హీరో ఉంటున్నారో తెలుసా...?

  • ఒకప్పుడు మద్రాస్ లో తెలుగు చిత్ర పరిశ్రమ
  • కాలక్రమంలో హైదరాబాద్ షిఫ్ట్ అయిన టాలీవుడ్
  • ఇప్పటికీ చెన్నైలోనే ఉంటున్న పలువురు నటులు
ఒకప్పుడు దక్షిణాది భాషల చిత్ర పరిశ్రమలు మద్రాస్ (ఇప్పుడు చెన్నై) లో ఉండేవి. కాలక్రమంలో టాలీవుడ్ హైదరాబాదుకు షిఫ్ట్ అయింది. అయితే ఇప్పటికీ కొందరు నటులు చెన్నైలోనే ఉండిపోయారు. అలాంటివారిలో భానుచందర్ ఒకరు. 

యాక్షన్ చిత్రాలకు పెట్టిందిపేరైన భానుచందర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... భానుచందర్ ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు అందాల నటి త్రిషది. త్రిష తన ఇంటిని భానుచందర్ కు విక్రయించారు. ఆ ఇంటిని భానుచందర్ ఎంతో అందంగా తీర్చిదిద్దుకున్నారు. చక్కని పూలమొక్కలతో ఇంటి చుట్టూ పచ్చదనాన్ని పరిచారు! 

ఆయన నివాసంలోకి ఎంటర్ కాగానే హాల్లోనే మినీ బార్ కనిపిస్తుంది. అయితే, అందులో అన్నీ ఖాళీ బాటిల్సే దర్శనమిచ్చాయి. అదేంటని ఓ చానల్ యాంకర్ అడిగితే, తాను మద్యం మానేసి 20 ఏళ్లయిందని భానుచందర్ వెల్లడించారు. జస్ట్ అప్పియరెన్స్ కోసమే ఆ మినీ బార్ ను హాల్లో ఉంచామని తెలిపారు.

ఇక, ఇంటి చుట్టూ పచ్చదనం అంతా తన భార్య చలవేనని, అవన్నీ ఆమె నాటిన మొక్కలేనని వివరించారు. ఎప్పుడన్నా త్రిష కనిపిస్తే... మా ఇల్లు ఎలా ఉంది? అని అడుగుతుందని చెప్పారు. గతంలో త్రిష బెడ్రూం, ఇప్పుడు తన బెడ్రూం అయిందని అన్నారు. 

తన పెద్ద కుమారుడు రెండు తెలుగు సినిమాల్లో నటించాడని, చిన్న కుమారుడు డాక్టర్ అని భానుచందర్ వెల్లడించారు. ఖాళీ సమయాల్లో గిటార్ వాయిస్తూ, కీబోర్డు ప్లే చేస్తూ సంగీతాన్ని ఆస్వాదిస్తానని తెలిపారు.


More Telugu News