ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసి విరాళం అందించిన హీరో సాయి దుర్గా తేజ్

  • విజయవాడను ముంచెత్తిన వరదలు
  • లక్షలాది మందికి వరద కష్టాలు
  • ఉదారంగా స్పందిస్తున్న దాతలు
ఏపీలో ఇటీవల సంభవించిన వరదలతో లక్షలాది ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. ముఖ్యంగా విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడింది. విజయవాడలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. 

ఈ నేపథ్యంలో, వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తాజాగా, మెగా హీరో సాయి దుర్గా తేజ్ ఏపీ మంత్రి నారా లోకేశ్ ను కలిసి రూ.10 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా సాయి దుర్గా తేజ్ ను మంత్రి లోకేశ్ మనస్ఫూర్తిగా అభినందించారు. 

ఇక, ఇవాళ కూడా నారా లోకేశ్ ను చాలామంది కలిసి విరాళాలు అందించారు. సచివాలయంలోని 4వ బ్లాక్ లో మంత్రి నారా లోకేశ్ ను కలిసిన దాతలు చెక్కులు అందజేశారు. 

డిక్షన్ గ్రూప్ ( Dixon group ) తరపున రూ.1 కోటి చెక్ ను కంపెనీ ప్రతినిధులు లోకేశ్ కు అందించారు. నెక్కంటి సీ ఫుడ్స్ తరఫున సంస్థ ప్రతినిధులు రూ.1 కోటి విరాళం అందించారు.

  • శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్ మిల్లర్ల అసోసియేషన్ రూ.25 లక్షలు.
  • 'రేస్ పవర్' సంజయ్ గుప్తా రూ.25 లక్షలు
  • ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలుకు చెందిన డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి రూ.11 లక్షలు
  • ముప్పవరపు వీరయ్య చౌదరి రూ.5 లక్షలు
  • ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో ఆల్ఫా ఇన్ స్టిట్యూట్ రూ. 5 లక్షలు
  • రైతులు మరియు కార్యకర్తలు కలిసి రూ.5 లక్షలు
  • రక్ష హాస్పిటల్స్ నాగరాజు రూ. 5 లక్షలు
  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ది వంశీ కృష్ణ, పెద్ది విక్రమ్ కలిసి రూ.3 లక్షలు, చదలవాడ చంద్రశేఖర్ రూ. 3 లక్షలు
  • జర్నలిస్టు జాఫర్ రూ. 1 లక్ష
  • భీమవరపు శ్రీకాంత్ రూ.2 లక్షలు
  • ఆశా బాల రూ.1.8 లక్షలు
  • వి. జ్యోతి రూ. లక్ష
కాగా, వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం చేసిన అందరికీ మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు



More Telugu News