పవన్ కల్యాణ్ నన్ను కలిసి కోటి రూపాయల చెక్కును అందించారు: సీఎం రేవంత్ రెడ్డి
- పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన తెలంగాణ సీఎం
- వరద బాధితుల సహాయార్థం విరాళం అందించారన్న రేవంత్ రెడ్డి
- తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నానంటూ ట్వీట్
తెలంగాణ వరద బాధితులకు రూ.1 కోటి విరాళం అందించిన ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
పవన్ కల్యాణ్ తనను కలిశారని, వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారని తెలిపారు. జనసేనానికి నా తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం పవన్ కల్యాణ్ రూ.6 కోట్ల విరాళం ఇచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.1 కోటి ఇచ్చారు. అలాగే ఏపీలో 400 గ్రామ పంచాయతీలకు... ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున ప్రకటించారు. మొత్తం ఆరు కోట్ల రూపాయలను ఆయన వరద బాధితుల సహాయార్థం అందించారు.